TSPSC Recruitment 2021
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలని సూచించింది.
సీనియర్ అసిస్టెంట్(పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ) – 15 ఖాళీలు
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్((పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ) – 10 ఖాళీలు
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్((జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ) – 102
ఏప్రిల్ 12వ తేదీ నుంచి అభ్యర్ధులు అఫీషియల్ వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ, ఫీజు చెల్లింపు లాస్ట్ డేట్ మే 5వ తేదీగా నిర్ణయించింది.
పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం
జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలలోని ఖాళీలకు టీఎస్‌పిఎస్‌సి ఈ నియామకాన్ని నిర్వహిస్తోంది.
వయోపరిమితి: 18-34 వయస్సు
అర్హత:
యూనివర్శిటీ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా లేదా బిసిఎ డిగ్రీ లేదా ఎలిక్టివ్ సబ్జెక్టులలో ఒకదానితో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ.
లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
ఎంపిక విధానం:
టిఎస్‌పిఎస్‌సి 10 వేర్వేరు కేంద్రాల్లో ఒక పరీక్ష (సిబిటి లేదా రాత) నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన తేదీలు త్వరలోనే ప్రకటిస్తారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి