NRA - నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ - జాతీయ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు ఒకటే స్క్రీనింగ్ పరీక్ష
NRA అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ.
జాతీయ స్థాయిలో నిర్వహించే ఉద్యోగ నియామకాలకు ఇకమీదట అన్నింటికీ కలిపి ఒకటే స్క్రీనింగ్ పరీక్ష జరుపబడును.
ఉదాహరణకు IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షలకు వేర్వేరు స్క్రీనింగ్ పరీక్షలు ఉండేవి ఆ తర్వాత రెండవ దశ పరీక్షలు మరియు మౌఖిక పరీక్షలు అనగా ఇంటర్వ్యూలు జరిగేవి. కానీ ఇప్పుడు వీటన్నింటికి కలిపి ఒకటే స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.
కానీ రెండవ దశ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఏ సంస్థకు ఆ సంస్థ నిర్వహించు కోవాల్సి ఉంటుంది. అనగా NRA నిర్వహించే పరీక్షలు అర్హత సాధించిన వారు మాత్రమే వివిధ సంస్థలు నిర్వహించే రెండవ దశ పరీక్ష మరియు ఇంటర్వ్యూలకు అర్హులు.
Important Points in NRA
- ఈ అర్హత పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడును.
- ఈ పరీక్షలో సాధించిన స్కోరు మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
- తమ స్కోరును మెరుగుపరచ దలచినవారు మరల ఈ పరీక్ష వ్రాయవచ్చు.
- మొదట IBPS,SSC,RRB వంటి సంస్థలను ఈ NRA జాబితాలో చేర్చనున్నారు. దశలవారీగా మిగిలిన జాతీయ సంస్థలను కూడా ఈ జాబితాలో చేరుస్తారు.
- ప్రస్తుత రిజర్వేషన్ పద్ధతిని దీనికి కొనసాగిస్తారు.
- SC, ST, OBC, PWD వారికి సడలింపులు వర్తిస్తాయి.
- ఇతర ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ స్కోరు ను పరిగణలోకి తీసుకొని నియామకాలు చేపట్టవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
- ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలియజేయడమైనది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి