ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 9 మరియు ఆ పై తరగతులకు స్కూల్స్ ని ఓపెన్ చేయుటకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాఠశాలలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించే టట్లు చూడాలని మరియు శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరానికి సిలబస్ కుదింపు గురించి ఇదివరకే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వార్షిక పరీక్షల గురించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి విద్యాశాఖ అధికారుల నుంచి కావలసిన సమాచారాన్ని అంద చేయవలసిందిగా ఆదేశించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి